AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణం కేసులో తవ్వే కొద్దీ విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు 3,708 బస్తాలు మాయం అయినట్లు ప్రకటన రాగా.. తాజాగా పూర్తయిన విచారణలో మొత్తం 7,577 రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్లు నిర్ధారణ అయింది. కాగా, పేర్ని నాని కుటుంబం అరెస్ట్ కాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 20 రోజులకు పైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు.