గిద్దలూరు: వివేకానంద కాలనీని పరిశీలించిన ఎమ్మెల్యే

79చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు నీరు తోడి పోసుకుంటున్నారు. ఈ విషయం ఆయన దృష్టికి రావడంతో కాలనీని సందర్శించి ప్రజలకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you