రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు

76చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముక్తాపురం గ్రామ సమీపంలో రోడ్డుకు ఇరువైపున పెరిగిన పిచ్చి మొక్కలను బుధవారం దివ్య హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ తొలగించింది. గత కొద్దిగ రోజులకు ఈ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సంస్థ అధ్యక్షుడు శరత్ రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను జెసిబి సహాయంతో తొలగించారు.

సంబంధిత పోస్ట్