ఆశీర్వదించండి అండగా ఉంటా: ఉగ్ర

62చూసినవారు
ఆశీర్వదించండి అండగా ఉంటా: ఉగ్ర
కనిగిరి పట్టణంలో తొగట వీర క్షత్రియులు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కనిగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తనకు మద్దతు తెలపాలని కోరారు. తొగట వారికి నారాచంద్రబాబు అండగా నిలుస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తొగట నాయకులు, స్థానిక టిడిపి
నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్