కనిగిరి లోని టకారి పాలెం వద్ద విద్యుత్, డ్రైనేజ్, నీటి సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు బుధవారం ఆందోళన చేపట్టారు. చిల్లకంపలను జాతీయ రహదారిపై వేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో స్పందించిన స్థానిక ఎస్సై శ్రీరామ్ సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరిస్తామని నచ్చచెప్పి అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.