సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని సెల్ టవర్ ఎక్కి అయూబ్ ఖాన్ అనే వ్యక్తి నిరసనకు దిగాడు. సోమవారం ఈ ఘటన జరిగింది. సింగరాయకొండ మండల పరిసర ప్రాంతాలలో పేదల భూములు కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారని 3 గంటల పాటు సెల్ టవర్ పై ఉండి నిరసన తెలిపాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆయుబ్ ఖాన్ కు నచ్చ చెప్పి సెల్ టవర్ పైనుంచి కిందకు దించారు. తర్వాత అతనిని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.