ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం వాగేమడుగు గ్రామంలో ఆదివారం కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి కోడిపందాలు ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 41, 850 నగదు. 6 పందెం కోళ్ళు, 7 మోటార్ సైకిళ్లు, 6 కత్తులను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై రాజకుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించబోమని ఎస్సై ప్రజలను హెచ్చరించారు.