ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలో అలసంద, బొబ్బర్లు, పొగాకు పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయామని శుక్రవారం తెలిపారు. అప్పులు చేసి మరి ఎకరాకు రూ. 20 వేలు వరకు పెట్టుబడి పెట్టినట్లుగా రైతులు చెప్పారు. తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.