మార్కాపురం: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

50చూసినవారు
మార్కాపురం: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందినట్లుగా శనివారం వైద్యులు తెలిపారు. వృద్ధుడి తరపు బంధువులు ఎవరూ లేకపోవడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడి వివరాలను దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడుకు చెందిన రాజేంద్రన్ (85) గా పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో గత నెల 26న ఆసుపత్రిలో చేరినట్లుగా వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్