ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా వేధింపులు చేస్తే ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలుపుదల చేయడం నేరమన్నారు.