ఒంగోలులో వర్షం.. రహదారిపైకి చేరిన నీరు
ఒంగోలు నగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో వర్షానికి 4వ డివిజన్ లో రహదారిపైకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు కుక్కలు అధికంగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ మరమ్మత్తులు చేయించాలని, రహదారిపై నీరు ఆగకుండా చూడాలని కోరుతున్నారు.