ఒంగోలు: వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాము
ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించామని ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలులో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలలో అన్ని కులాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమన్నారు.