ఇంకొల్లు: మహిళలపై వివక్ష తగదు
ఇంకొల్లులోని వెలుగు కార్యాలయం నందు సోమవారం జెండర్ ఆధారిత హింస పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం అనురాధ పాల్గొని మహిళల పై హింసకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో నేటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. అత్యాచారం, గృహహింస కొనసాగుతూనే ఉన్నాయని అనురాధ తెలిపారు. మహిళలపై వివక్ష తగదని చెప్పారు.