కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామం అంబేద్కర్ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్కూలు ఆవరణంలో వర్షపు నీటితో నిండిపోయింది. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే మెయిన్ గేట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వర్షపు నీటి కారణంగా మెయిన్ గేట్ నుంచి వెళ్లలేక స్కూలు ప్రహరీ గోడ ఎక్కి స్కూల్ కి వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలన్నారు.