
పర్చూరు: ఓట్ల తొలగింపుపై ఏర్పాటు చేసిన సిట్ రద్దు
పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన సిట్ ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదు మేరకు ఈ నెల 3న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అధ్యక్షతన సిట్ ఏర్పాటైంది. అయితే దీనిపై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిట్ రద్దయిందని తెలిసింది.