దోర్నాల మండలంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో నాజర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో గ్రామస్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారు పై గ్రామస్థాయిలో బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకొని పరిష్కరిస్తారని, ఈ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.