బేస్తవారిపేట: బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చిన్న ఓబునేనిపల్లి గ్రామంలో శుక్రవారం ఎస్సై రవీంద్రరెడ్డి బెల్ట్ షాప్ పై దాడులు నిర్వహించి గ్రామానికి చెందిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 35 కోటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.