పేకాట శిబిరంపై దాడులు
చీమకుర్తి మండలంలోని నక్కల వాగు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించామని తెలిపారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మండలంలో ఎవరైనా పేకాట లాంటివి ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.