AP: రాష్ట్రంలో రోజు రోజుకి చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.