దర్శి: పేద ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు

55చూసినవారు
దర్శి: పేద ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు
పేద ఖైదీల కోసం తమ తరపున వాదించడానికి ఉచిత న్యాయ సేవలను అందిస్తున్నట్లుగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు పరిటాల సురేష్ తెలిపారు. దర్శి సబ్ జైలులోని ఖైదీలకు శనివారం ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కోర్టులో తమ కేసుల పరిష్కారం కోసం లాయర్లను పెట్టుకోలేని పేద ఖైదీల కోసం ప్రభుత్వం చొరవ చూపిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్