Apr 26, 2025, 07:04 IST/
కర్రె గుట్టపై కాల్పులు ఆపాలి: పౌర హక్కుల సంఘాలు
Apr 26, 2025, 07:04 IST
TG: కర్రె గుట్టపై బాంబుల వర్షం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హన్మకొండలో పౌర హక్కుల సంఘాలు అత్యవసర భేటీ ఏర్పాటు చేశాయి. కర్రె గుట్టపై వెంటనే కాల్పులు ఆపాలంటూ పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ డిమాండ్ చేశాయి. హెలికాప్టర్లతో కర్రెగుట్టపై భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. దీంతో పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.