ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్ల గుంట్ల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో స్థానిక ఎంపీటీసీ ఇంటిలోకి చొరబడి దొంగలు బీరువా పగలగొట్టి అందులో ఉన్న 12 తూలాల బంగారం, 20 తులాల వెండి, 7, 000 రూపాయల నగదును అపహరించి తీసుకువెళ్లారు. ఉదయాన్నే దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించిన ఎంపిటిసి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.