
కందుకూరులో రూ. 50 కోట్లతో పనులు
విజయవాడలో నెల్లూరు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా వైస్ చైర్మన్ కమిషనర్ సూర్య తేజ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మంత్రి నారాయణ బుధవారం భేటీ అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీ కందుకూరులో సీఎం పర్యటన సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. కందుకూరును రూ. 50 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం తెలుపగా అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి నారాయణ మాట్లాడారు.