
కందుకూరు: యువగళం పాదయాత్రకు నేటితో రెండేళ్లు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగు పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో రెండేళ్లు పూర్తయిందన్నారు.