తక్కువ లోతులో భూకంప కేంద్రం ఏర్పడితే.. ప్రకంపనల సమయంలో బూమింగ్ శబ్దాలు వినిపిస్తాయి. భూఉపరితలానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ శబ్దాలు ఎక్కువగా వస్తాయి. భూకంపం ద్వారా వచ్చిన ప్రకంపనాలు గాలిలో ధ్వని తరంగాలుగా మారి, అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల వల్ల బూమ్ అనే శబ్దం వస్తుందని జియోలాజికల్ సర్వే నిపుణులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో కంపనాలు లేకపోయినా, ఈ భారీ శబ్దాలు వినిపిస్తాయని అంటున్నారు.