తెలంగాణ నేతలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు అక్కడి చేరుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో టీ కాంగ్రెస్ కీలక నేతలు గురువారం పార్లమెంటు హాలులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రి వర్గ విస్తరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే విస్తరణపై ఓ ప్రకటన రానున్నట్టు సమాచారం.