Sep 18, 2024, 07:09 IST/
మహిళా రోగికి 'అదుర్స్' సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసిన కాకినాడ జీజీహెచ్ వైద్యులు
Sep 18, 2024, 07:09 IST
ఓ మహిళా రోగికి 'అదుర్స్' సినిమా చూపిస్తూ కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు మంగళవారం విజయవంతగా శస్త్రచికిత్స చేశారు. 55 ఏళ్ల మహిళ మెదడులో 3.3x2.7 సెం.మీల పరిమాణంలోని కణితిని 'అవేక్ క్రానియోటమీ' విధానంలో వైద్యులు తొలగించారు. సర్జరీ సమయంలో నరాలు దెబ్బతినకుండా నివారించేందుకు సినిమా చూసేలా చేశారు. కాకినాడ జీజీహెచ్ ఈ తరహా శస్త్రచికిత్స చేపట్టడం ఇదే తొలిసారి. మరో 5 రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామన్నారు.