టికెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కిన ఓ మహిళా లాయర్ టీటీఈ టికెట్ అడగ్గా ఆయనపై రివర్స్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో రైలులో చోటుచేసుకుంది. ఓ లేడీ లాయర్ టికెట్ తీసుకోకుండా నేరుగా ఏసీ 2-టైర్ కోచ్‌లో ప్రయాణిస్తోంది. టీటీఈ ఆమెను టికెట్ అడగ్గా అతడిపై విరుచుకుపడింది. చివరికి రైలు నుంచి దిగాక ఆయనపై భౌతిక దాడికి పాల్పడింది. దీనిపై నెటిజన్లు ఫైరవుతున్నారు.