పెళ్లి కాకుండా మరణించిన వారికి బొమ్మల రూపంలో వివాహం జరిపిస్తున్న కేరళలోని మగోర్ తెగ ప్రజలు

566చూసినవారు
పెళ్లి కాకుండా మరణించిన వారికి బొమ్మల రూపంలో వివాహం జరిపిస్తున్న కేరళలోని మగోర్ తెగ ప్రజలు
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో మగోర్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రజలు వారి కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండానే మరణిస్తే.. వారికి బొమ్మల రూపంలో ఘనంగా వివాహం జరిపిస్తారు. ఈ వివాహాన్ని సాధారణ పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోకుండా, బంధువుల సమక్షంలో వేడుకలా జరుపుతారు. ఈ బొమ్మల పెళ్లి తర్వాత, (చనిపోయిన) వధూవరుల కుటుంబాలు బంధువులుగానే కొనసాగటం మరో విశేషం. ఇలా పెళ్లి చేస్తే మృతి చెందిన తమ బంధువుల ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయన్నది వారి నమ్మకం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్