కాపునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమాలలో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కనిగిరిలో కాపులందరికీ అనువైన ప్రదేశం లో త్వరలోనే కాపు సంక్షేమ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన వాగ్దానం మేరకు వచ్చే కార్తీక వన భోజనాలు నాటికి కాపు సంక్షేమ భవనం ప్రారంభిస్తామని తెలిపారు.