వెల్లంపల్లిలో స్కూలు బస్సు బోల్తా
మద్దిపాడు మండలం వెల్లంపల్లి-కొలచనకోట సమీపంలో శుక్రవారం ఇరుకైన టర్నింగ్ వద్ద స్కూల్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పింది. రహదారి మార్జిన్లోని చిల్లచెట్లలో దూసుకుపోయింది. ఈ సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉండగా పి.శ్రీవేద(7) బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్ధులకు ఎటువంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.