TG: యూపీలోని అలహాబాద్ IIITలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ మాదాల చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది శనివారం అర్ధరాత్రి తన పుట్టిన రోజునే హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సూసైడ్ ముందు 'నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..' అని తల్లి స్వర్ణలతకు మెసేజ్ పెట్టాడు.