AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విషాదం చోటు చేసుకుంది. యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాత్రూమ్‌లో అప్పలసూరి అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అప్పలసూరి భార్య ఆరోపించారు. బాధిత కుటుంబీకులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.