ప్రతీ విద్యార్ధి ఉన్నతస్థాయికి చేరాలి.

2116చూసినవారు
ప్రతీ విద్యార్ధి ఉన్నతస్థాయికి చేరాలి.
దోర్నాలలోని బ్రమరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాల వార్షికోత్సవం శనివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ జి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పెద్దదోర్నాల నందు 2009 లో భ్రమరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాలను ప్రారంభించి ఈ ప్రాంత విద్యాభివృద్ధికి సుధాకర్రెడ్డి , బట్టు రమణారెడ్డి లు కృషి చేశారన్నారు. మరో అతిధి బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సత్ప్రవర్తనతో మెలుగుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడేలా తయారవ్వాలన్నారు. విద్యాసంస్థల చైర్మన్ బట్టు రమణారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న పరీక్షలకు సన్నద్ధమై మంచి ఫలితాలు సాధించి కళాశాలకు , తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టు విద్యాసంస్థల డైరెక్టర్ బట్టు వసంత కుమారి, దంతవైద్యులు బట్టు ప్రవల్లికా రెడ్డి , పుర ప్రముఖులు గాలే నాయక్ , అధ్యాపకులు బి హనోక్, బెంజిమెన్, పవన్, వెంకటేశ్వర్లు, మధు, జన విజ్ఞాన వేదిక నాయకులు ఏనుగుల రవి కుమార్ తదితులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్