మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో భారీ వర్షాలు

72చూసినవారు
పశ్చిమ ప్రకాశం ప్రాంతమైన మార్కాపురం డివిజన్ లో గురువారం రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిశాయి. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో వాహనదారులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్