మార్కాపురం ఎస్ వి కే పి కళాశాలలో మంగళవారం నాడు భౌతిక శాస్త్రవేత్త అయిన సర్ ఐజక్ న్యూటన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ మిరియాల నాసరయ్య మాట్లాడుతూ న్యూటన్ ప్రపంచంలోనే అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడారు. ఆయన ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందనే అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. అందువలన ఆధునిక ప్రపంచం ఆయనను సైన్సు పితామహుడిగా గౌరవస్తుందన్నారు. మాట్లాడుతూ భౌతిక శాస్త్ర అధ్యాపకులు ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందనే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ తెలుగు అధ్యాపకులు కెవియస్ శాస్త్రి, చరిత్ర అధ్యాపకులు పొన్నబోయిన ఆవులయ్య, గణిత శాస్త్ర అధ్యాపకులు తమిదల శ్రీనివాసరెడ్డి, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు బొటుకు పుల్లారావు, ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు వడ్డే రవికాంత్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.