తర్లుపాడు మండలం మేకల వారి పల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న జూదరులను స్థానిక ఎస్సై బ్రహ్మనాయుడు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ. 6, 400 నగదు రెండు ద్విచక్ర వాహనాలను. స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు. జూదరులను పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని బ్రహ్మనాయుడు చెప్పారు. కోడి పందాలు, పేకాట ఆడటం చట్టరీత్య నేరమని ఎస్సై ప్రజలను హెచ్చరించారు.