రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన మద్యం పాలసీని వెంటనే నిలిపివేయాలని మహిళలు సోమవారం నిరసన తెలిపారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ అధికారులు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహిళలు అక్కడికి చేరుకొని తక్షణమే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.