రామ్‌గోపాల్ వర్మ, వివాదాస్పద చిత్రాలు తీసి, వ్యక్తిగత దూషణలు చేసి చట్టంతో చిక్కులో ఉన్నాడు. మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన తర్వాత, విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న వర్మ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సమయం కావాలని పేర్కొన్నాడు. అయితే సోమవారం విచారణకు హాజరు కాలేకపోయిన వర్మను హైదరాబాద్‌తో పాటు తమిళనాడులో పోలీసులు గాలిస్తున్నారు.