Mar 30, 2025, 13:03 IST/
రూ.800 ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వని యాజమాన్యం.. విద్యార్థిని ఆత్మహత్య
Mar 30, 2025, 13:03 IST
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది తరగతి విద్యార్థిని రూ.800 ఫీజు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయనీయకుండా అడ్డుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్కూల్ మేనేజర్, ప్రిన్సిపాల్‌పై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు