AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిపై అత్యాచారం చేసి, వీడియోలు చిత్రీకరించాడు ఓ వ్యక్తి. ఇటీవల ఒక మహిళతో వివాదం తలెత్తడంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తన భార్యపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని యువతిపై మహిళ భర్త బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.