Oct 20, 2024, 16:10 IST/
తెలంగాణకు భారీ వర్ష సూచన!
Oct 20, 2024, 16:10 IST
రానున్న 24 గంటల్లో తూర్పు, పశ్చిమ బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 23, 24 తేదీలలో ఈదురు గాలులతో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పంట పొలాలలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ ప్రకటించింది.