పొదిలి: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ప్రకాశం జిల్లా పొదిలిలో ఈనెల 5వ తేదీన మాదిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ ఓంకార్ పై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు రమేష్ ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పొదిలి కోర్టులో ప్రవేశపెట్టినట్లుగా ఎస్సై వేమన తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 5 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపినట్లు వేమన చెప్పారు. ఓ భూవివాదంలో రమేష్ మాజీ సర్పంచ్ ఓంకార్ పై హత్యకు కుట్ర చేశాడని ఎస్సై తెలిపారు.