మందమర్రి పట్టణంలో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాత బస్టాండ్ నుంచి రామన్ కాలనీ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న రోడ్లు ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులు చేసేందుకు పనులను చేపట్టారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ముందుగానే స్వచ్ఛందంగా కొంతమంది వ్యాపారస్తులు తమ దుకాణాలను తొలగించి వేశారు.