మాదకద్రవ్యాల వాడకంతో విద్యార్థులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ బెల్లంపల్లి సిఐ ఇంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్ధాలపై ఆయన సమగ్రంగా విద్యార్థులకు వివరించారు.