సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు
ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం రావులకొల్లుకు చెందిన దుర్గారావు (24) వినాయక నిమజ్జనానికి గ్రామస్థులతో కలిసి శనివారం పాకలబీచ్కు వచ్చాడు. గణేష్ నిమజ్జనం అయిన తర్వాత బీచ్ లో స్నానం చేస్తూ అలాల తాకిడికి నీటిలో కొట్టుకుపోతుండగా అప్రమత్తమైన మెరైన్ కానిస్టేబుల్ రాజేశ్, హోంగార్డ్ మస్తానయ్య యువకుడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. గ్రామస్థులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.