Nov 06, 2024, 12:11 IST/మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల: 27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష
Nov 06, 2024, 12:11 IST
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 27 మందికి బుధవారం న్యాయస్థానం వారం రోజులు జిల్లా కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో శుభ్రపరిచే పనులు చేపట్టాలని తీర్పు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.