సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు రోడ్డు ప్రమాదంలో బాలుడు గాయపడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు, దూదేకుల. సైదావలి తన కుమారుడు షాహిద్ (3) మంగళవారం రాత్రి రోడ్డు ప్రక్కన నుంచున్నారు. వేగంగా వస్తున్న టాటా ఇంట్రో వాహనం అదుపుతప్పి షాహిద్ ను డీ కొట్టింది. ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలైనాయి, చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు, సంఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.