తెలంగాణలో నాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి (నవంబర్ 18) నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వాహనాలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.