కాలేజి అభివృద్ధికి కృషి - ఏరీక్షన్ బాబు

72చూసినవారు
కాలేజి అభివృద్ధికి కృషి - ఏరీక్షన్ బాబు
ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ నాయుడు సిబ్బందితో కలసి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి కళాశాలలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్య శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్